రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పార్కులు , డివైడర్లు , కూడళ్ళలో పనిచేస్తున్న శానిటేషన్, గ్రీనరీ కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు , పాలకవర్గ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు ధర్నా చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో గల పార్కులు డివైడర్లలో శానిటేషన్ పనిచేస్తున్న 45 మంది కార్మికులు పనిచేసే కాంట్రాక్టు గత నెల డిసెంబర్ 11 వరకు అయిపోవడం జరిగిందని తర్వాత మళ్లీ టెండర్ మున్సిపల్ అధికారులు వెయ్యకపోవడం వలన కాంట్రాక్టర్ కార్మికులను పనిచేయవద్దని చెప్పడం జరిగిందన్నారు.
దానితో నెల రోజుల నుండి కార్మికులు పని లేకుండా ఉంటున్నారని దానికి తోడు కాంట్రాక్టర్ నుండి రావలసినటువంటి 3 నెలల వేతనాలు రాకపోవడం వలన ఒకపక్క పని లేక మరోపక్క చేసిన పనికి వేతనం రాకా కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొన్నదని ఇప్పటికే ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ కి వినతి పత్రాలు ఇచ్చిన కూడా సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు ఈ విషయంపై శుక్రవారం వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని కలిసి వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా ఆది శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి అడగగా వీళ్లు మున్సిపల్ లో పనిచేయడం లేదని
కాంట్రాక్టర్ల ఇళ్లలో పనిచేయడం జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడానికి ఖండిస్తున్నామని సిరిసిల్ల సుందరీకరణలో భాగంగా ప్రభుత్వమే మున్సిపల్ ద్వారా ఏర్పాటు చేసిన పార్కులు , డివైడర్లు , కూడళ్ళలో పనిచేసిన కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం సరికాదని మున్సిపల్ ద్వారానే మున్సిపల్ పాలకవర్గం ద్వారా తీర్మానం చేసి టెండర్ వేసి మున్సిపల్ లోని నాలుగు పట్టణ సమాఖ్యల పేరు మీద కాంట్రాక్టు తీసుకొని కార్మికుల శ్రమతో అవార్డులు ,రివార్డులు పొందిన సిరిసిల్ల మున్సిపల్ అధికారులు , పాలకవర్గం కార్మికులను ఈ విధంగా రోడ్డున పడేయడం సరికాదని ఇప్పటికైనా వెంటనే వీరికి కాంట్రాక్టర్ నుండి రావాల్సిన బకాయి వేతనాలు ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నర్సయ్య , శారద , రమణమ్మ , గీత , వసంత , మణెమ్మ , లక్ష్మి , శ్రీకాంత్ , రాకేష్ , వంశీ , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.