సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన నా సామిరంగ మూవీ( Naa Saamiranga Movie ) కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది.ఏరియాలతో సంబంధం లేకుండా అన్ని ఏరియాలలో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ఇప్పటికే 60 శాతం కలెక్షన్లను సాధించిన నా సామిరంగ సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి( Sankranti ) రేసులో సెకండ్ విన్నర్ నా సామిరంగ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నా సామిరంగ కలెక్షన్ల( Naa Saamiranga Collections ) విషయానికి వస్తే మూడు రోజుల్లో ఈ సినిమా 12.46 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.మరో 7.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది.మూడో రోజు ఈ సినిమాకు 3.5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
బీ, సీ సెంటర్లలో నా సామిరంగ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.అందువల్ల ఆన్ లైన్ బుకింగ్స్ తో పోల్చి చూస్తే ఆఫ్ లైన్ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొడుతోంది.నా సామిరంగ టైటిల్ సినిమాకు ప్లస్ అయిందని తొలి సినిమాతోనే విజయ్ బిన్నీకి( Vijay Binny ) భారీ సక్సెస్ దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సంక్రాంతి పండుగకు సరైన మూవీ నా సామిరంగ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
కీరవాణి( Keeravani ) మ్యూజిక్, సాంగ్స్, అషికా రంగనాథ్,( Ashika Ranganath ) నరేష్ నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.సినిమాలోని ఒక సీన్ లో వింటేజ్ నాగార్జున( Nagarjuna ) గుర్తుకు వచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.నాగార్జున భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.కొత్త ప్రాజెక్ట్ లతో నాగ్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనున్నారో చూడాల్సి ఉంది.