తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాయనే సంగతి తెలిసిందే.ఈరోజు నుంచి ఆఫీస్ లు మొదలయ్యాయి.
అయితే వీక్ డేస్ లో సైతం హనుమాన్( hanuman ) మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.సంక్రాంతికి విడుదలైన ఇతర మూడు సినిమాల బుకింగ్స్ మొత్తం కలిపితే ఎంతో హనుమాన్ మూవీకి అదే స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం.
సంక్రాంతి సినిమాలలో హనుమాన్ మూవీనే టాప్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ మూవీ కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతుండగా నార్త్ బెల్త్ లో ఇప్పటికే ఈ సినిమా పలు క్రేజీ సినిమాల కలెక్షన్ల రికార్డ్ లను బ్రేక్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
హనుమాన్ మూవీ మరో కార్తికేయ2 ( Karthikeya 2 )అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కార్తికేయ2 మూవీ కూడా చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.వీక్ డేస్ బుకింగ్స్ లో హనుమాన్ మూవీ అదుర్స్ అనిపిస్తోంది.మౌత్ టాక్ తోనే హనుమాన్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
తేజ సజ్జా( Teja Sajja ) ప్రశాంత్ వర్మ కష్టానికి మించి ఈ సినిమాతో భారీ ఫలితం వచ్చిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
హనుమాన్ మూవీ ఈ రేంజ్ లో ఎందుకు హిట్టైందనే ప్రశ్నకు వేర్వేరు కారణాలు వినిపిస్తున్నాయి.పరిమిత బడ్జెట్ తో ఈ స్థాయిలో హిట్ కావడం హనుమాన్ కే సాధ్యమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
హనుమాన్ సక్సెస్ తో ఇతర భాషల్లో సైతం తెలుగు సినిమాల స్థాయి మరింత పెరిగింది.హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ మరింత భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో తెరకెక్కుతోంది.