ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ పిటిషన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకులతోపాటు పార్టీలకు రాజీనామాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

 Tdp Petition To Assembly Secretary Disqualify Those Four, Ap Elections, Tdp, Ysr-TeluguStop.com

ముఖ్యంగా అధికార పార్టీలో ఇన్చార్జిల మార్పు విషయంలో భిన్న స్వరాలు వినబడుతున్నాయి.ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు.2019 ఎన్నికలతో గమనిస్తే  2024 ఎన్నికల వాతావరణం పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉండగా నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాజాగా అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ నేతలు( TDP Leaders ) పిటిషన్ అందించారు.టీడీపీ శాసనసభాపక్ష నేత బాల వీరాంజనేయ స్వామి పేరుతో ఈ పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.2019 ఎన్నికలలో వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలగిరి టీడీపీ తరపున గెలవడం జరిగింది.ఆ తర్వాత వైసీపీ( YCP )కి మద్దతు తెలిపారు.దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ నేతలు పిటిషన్ అందించడం జరిగింది.

విషయంలోకి వెళ్తే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేలే ఓటర్లు.దీంతో తాజాగా జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలు సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube