టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన సినిమా సలార్( Salar ).పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, శ్రీయా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు తదితరులు నటించిన విషయం తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే ఆరంభంలో భారీ స్పందన లభించిన సలార్ మూవీకి ఆ తర్వాత నుంచి మాత్రం దీనికి రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే ఉంది.ప్రభాస్ నటించిన సలార్ కు నైజాంలో రూ.60 కోట్లు, సీడెడ్లో రూ.24 కోట్లు, ఏపీ రూ.60 కోట్లతో కలిపి తెలుగులో రూ.144 కోట్ల బిజినెస్ అయింది.అలాగే, కర్నాటకలో రూ.30 కోట్లు, తమిళనాడులో రూ.12 కోట్లు, హిందీలో రూ.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ.3 కోట్లు, కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో రూ.75 కోట్లతో రూ.345 కోట్లు బిజినెస్ జరిగింది.ఇక 20వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.10 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.
వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ చిత్రం రూ.50 లక్షలు షేర్ వసూలు చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తుంది అనుకున్న సలార్ సినిమా ఊహించిన విధంగా కలెక్షన్ల విషయంలో వెనుకబడిపోయింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే ఈ సినిమాకు కోట్లు నష్టం జరిగినట్లు అర్థమవుతోంది.
సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో వెనకబడిపోవడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా ఉంది.అయితే ఈ సినిమాకు 60 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మరి ఇంకా ముందు ముందు ఈ సినిమా కలెక్షన్లు రాబడుతుందో లేదో చూడాలి మరి.