తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్( Trivikram ) లాంటి డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పాలి.అయితే ఈయన చేస్తున్న తప్పు ఏంటి అంటే కథలు ఆయన రాయకుండా వేరే వాళ్ళ కథలు మీద డిపెండ్ అయి వాటిని కాపీ చేస్తున్నాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే తనతోపాటు సహదర్శకులుగా గుర్తింపు పొందిన రాజమౌళి, సుకుమార్ లాంటి డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్( Pan India Movies ) లో సినిమాలు తీసి వాళ్ల సత్తాను చాటుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంటే త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.మరి ఈయన్ ఎందుకు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడం లేదు అనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ పాన్ ఇండియా సినిమా చేయడానికి మాత్రం త్రివిక్రమ్ ఎప్పుడు సాహసం చేయడం లేదు.ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కూడా గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )ని కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం చేస్తున్నాడు.మరి ఈయన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనే విషయం మీద చాలామంది సినీ పెద్దలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇక ఇది ఇక ఉంటే చిన్న చిన్న డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటే త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా సినిమాకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
అంటే ఆయన ఉద్దేశ్యం లో ఆయన సినిమాలని తెలుగు వాళ్ళు మాత్రమే అదరిస్తారు పాన్ ఇండియా లో ఉన్న జనాలు తన సినిమాని ఆదరించలేరు అని అనుకుంటున్నాడా అని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.