ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానన్నారు.ఆవేదనతో మాట్లాడానన్న ఆయన తనకు వేరే ఉద్దేశం లేదని తెలిపారు.
తమ నాయకుడు జగన్ అడుగుజాడల్లోనే నడుస్తామని ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు పేర్కొన్నారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు వింటామని తెలిపారు.ఓ సాధారణ వ్యక్తిగా ఉన్న తనను ఎమ్మెల్యేను చేశారని చెప్పారు.అయితే తన మాటలను కొందరు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని వెల్లడించారు.







