వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు చెందిన రాగుల నర్సింహ రెడ్డి – పద్మ, ఆడేపు శోభ- నాగేశ్వర్, గన్న పద్మా రెడ్డి- వనజ, గొంగళ్ళ ఉమా శంకర్ – భవాని ల కుమారులు సాయి కృష్ణ రెడ్డి, నటరాజ్, చంద్రశేఖర్ రెడ్డి,సాయి ప్రసాద్ లు వృత్తి రీత్యా అమెరికా లోని న్యూ జెర్సీ లో ఉద్యోగం చేస్తున్నారు.
రాగుల నర్సింహ రెడ్డి పద్మ ల కుమారుడు సాయి కృష్ణా రెడ్డి ఎల్లారెడ్డిపేట కు రాగ తన మిత్రుల సహకారంతో ఎల్లారెడ్డిపేటలోని డే కేర్ సెంటర్ అదే విదంగా గంభీరావుపేట లోని మా వృద్ద శ్రమం లో ఉంటున్న 31 మందికి బ్రెడ్,పండ్ల పంపిణీ చేశారు.ఏడాది పాటు ఎల్లారెడ్డిపేట లోని డే కేర్ సెంటర్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఏడాది పాటు వరి ప్యాలాలు స్నాక్స్ లాగా అందిస్తామని వీరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు తో పాటు ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.