ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.
ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన రాజీనామా లేఖను పంపారు.తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు దాడి వీరభద్రరావు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో దాడి వీరభద్రరావు కీలక నేతగా వ్యవహారించారు.అయితే పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో పాటు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయన నిరాశకు గురై పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే గత కొంతకాలంగా దాడి వీరభద్రరావు, మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.