విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని ఎంతగానో ప్రోత్సహించేవారు అప్పట్లో ఆమె నటించిన ప్రతిఘటన సినిమాని రెండుసార్లు చూశారట.ప్రతిఘటన సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు.
తన జీవితంలో రెండుసార్లు చూసినా ఏకైక సినిమా ప్రతిఘటన అనే స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారంటే ఆ సినిమాకి ఎన్టీఆర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.దానిని ఎంత ఇష్టపడ్డారో కూడా స్పష్టమవుతోంది.
విజయశాంతి సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్‌తో( ntr ) స్క్రీన్ షేర్ చేసుకుంది.ఆమె ఆ సినిమాలో నటుడికి చెల్లెలిగా నటించింది.ఎన్టీఆర్, విజయశాంతి ( Vijayashanti )మధ్య మంచి అనుబంధం ఉండేది.ఆమె ఇంటి నుంచి పంపించే లంచ్ బాక్స్ కూడా తినేవారు.
విజయశాంతి ఎక్కడ కలిసినా మంచి ఆతిథ్యం ఇచ్చేవారు.ప్రతిఘటన కుల వివక్ష, అణగారిన వర్గాల దుస్థితి వంటి సామాజిక సమస్యల చుట్టూ తిరుగుతుంది, అణగారిన వర్గాలకు అండగా ఉండాలనే ఎన్టీఆర్ సొంత రాజకీయ భావజాలానికి ఈ సినిమా దగ్గరగా ఉంటుంది.
న్యాయం, సమానత్వం కోసం పోరాడాలనే సినిమా సందేశం ఎన్టీఆర్ కి బాగా నచ్చినట్లు ఉంది.
1985లో యాక్షన్ డ్రామా చిత్రంగా ప్రతిఘటన సినిమా తెరకెక్కింది.టి.కృష్ణ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు ప్రొడ్యూస్ చేశాడు.ఇది భారతదేశంలో అవినీతి, రాజకీయాలను భ్రష్టు పట్టించడం వంటి వాటిపై పోరాటం చేసిన మహిళ స్టోరీ చుట్టూ తిరుగుతుంది.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది.
1985లో ప్రతిఘటన ( Prathighatana ) సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటన ప్రదర్శనకు గాను విజయశాంతికి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు అందించారు.ఆ నంది అవార్డును స్వయంగా ఎన్టీఆర్ విజయశాంతికి అందించి అభినందించారు.ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని చిత్రాల్లో నటించాలని ప్రోత్సహించారు.విజయశాంతి ఎన్టీఆర్‌ను ప్రతి ప్రత్యేక సందర్భంలో గుర్తుచేస్తుంది.రీసెంట్‌గా 100వ జయంతి నాడు కూడా నందమూరి తారకరామారావు గురించి ఎన్నో మంచి వ్యాఖ్యలు చేసింది అలాంటి యుగపురుషుడు మళ్ళీ పుట్టబోడని ఆమె పొగిడింది.ఇక బాలకృష్ణ విజయశాంతితో కలిసి ఎన్నో సినిమాలు తీశాడు.
ఆ విధంగా నందమూరి ఫ్యామిలీతో విజయశాంతికి మంచి అనుబంధం ఏర్పడింది.