కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు బహిర్గతం అయింది.న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, యనమల రాజేశ్ వర్గం మధ్య ఘర్షణ చెలరేగింది.
తుని టీడీపీ ఇంఛార్జ్ యనమల దివ్య ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో యనమల దివ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న యనమల రాజేశ్ ను యనమల రామకృష్ణుడు అడ్డుకోవడంతో వివాదం చెలరేగిందని తెలుస్తోంది.
దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.