ఈ 2023 ఏడాదిలో వివిధ ఫార్మాట్లలో భారత తరఫున 9 మంది బ్యాటర్లు సెంచరీలతో అదరగొట్టారు.అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ( Virat Kohli ) పేరిట ఉంది.ఏ ఏ ఆటగాళ్లు సెంచరీలు సాధించారో చూద్దాం.2023 ఏడాదిలో భారత జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అని గెలిచాడు.34 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 8 సెంచరీలు చేశాడు.
ఈ జాబితాలో భారత జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్( Shubman Gill ) రెండవ స్థానంలో నిలిచాడు.47 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 7 సెంచరీలు చేశాడు.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.34 అంతర్జాతీయ మ్యాచులు ఆడి నాలుగు సెంచరీలు చేశాడు.శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) ఈ 2023 ఏడాదిలో అద్భుతంగా రాణించాడు.25 అంతర్జాతీయ మ్యాచులు ఆడి మూడు సెంచరీలు సాధించాడు.
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) 45 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి రెండు సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్( KL Rahul ) 29 అంతర్జాతీయ మ్యాచులు ఆడి రెండు సెంచరీలు చేశారు.యశస్వి జైస్వాల్ 17 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి రెండు సెంచరీలు చేశాడు.
భారత జట్టు యువ బ్యాటర్లైన రుతురాజ్ గైక్వాడ్ 15 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఒక సెంచరీ చేశాడు.
సంజూ శాంసన్( Sanju Samson ) 13 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఒక సెంచరీ చేశాడు.ఈ 2023 ఏడాదిలో భారత జట్టు ఆటగాళ్లు అద్భుత ఆటను ప్రదర్శించి ఫుల్ ఫామ్ కొనసాగించారు కానీ ప్రపంచ కప్ టైటిల్ త్రుటిలో మిస్సయింది.వచ్చే 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడమే ధ్యేయంగా భారత జట్టు కసరత్తు చేస్తూ అటువైపుగా అడుగులు వేస్తోంది.
భారత జట్టు ప్రస్తుతం ఉండే కొనసాగిస్తే చాలు టీ20 వరల్డ్ కప్ భారత్ దే.