అఫిషియల్ : ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ లుక్.. ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రెజెంట్ జోరు మీద ఉన్నాడు.ఈయన ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుంటూ దూసుకు పోతున్నాడు.

 Surprising Update From Prabhas And Maruthi Project, Prabhas Vintage Look, P-TeluguStop.com

ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ఇటీవలే ”సలార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఎట్టకేలకు బాహుబలి తర్వాత మరో హిట్ అందుకుని ఫ్యాన్స్ ను కూడా ఫుల్ ఖుషీ చేసాడు.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్’‘( Salaar ) తో ప్రభాస్ 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేసాడు.ఇదిలా ఉండగా తన నెక్స్ట్ లైనప్ కూడా పెద్దదే అని చెప్పాలి.ప్రజెంట్ నాగ్ అశ్విన్ తో కల్కి చేస్తున్నాడు.దీంతో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోయినా కూడా షూటింగ్ మాత్రం పూర్తి చేస్తూనే ఉన్నాడు మారుతి.మరి ఎట్టకేలకు ఈ సినిమా నుండి మొదటిసారి అఫిషియల్ అప్డేట్ వచ్చింది.

సలార్ రిలీజ్ కావడంతో ఇక డార్లింగ్ నెక్స్ట్ సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మారుతి సినిమా( Maruthi movie ) నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.పొంగల్ కానుకగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తున్నట్టు చెప్పడమే కాకుండా ఇప్పటి వరకు డైనోసార్ ప్రభాస్ ను చుసిన మీరు నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ ను చూసేందుకు సిద్ధం కండి అంటూ చెప్పుకొచ్చారు.మొత్తానికి వింటేజ్ ప్రభాస్ ను అయితే చూపించడానికి రెడీ అయ్యారు మేకర్స్.

చూడాలి ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ అండ్ ఎనర్జీ ఏ లెవల్ లో ఉంటుందో.ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ ( Malavika Mohanan Nidhhi Agerwal ) కూడా నటించ బోతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube