వైసీపీ మంత్రి రోజా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ, జనసేనకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పుట్ బాల్ ఆడుతారని తెలిపారు.
చంద్రబాబు కుప్పంకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని మంత్రి రోజా ఆరోపించారు.
అలాగే వైఎస్ షర్మిల రాకపై స్పందించిన ఆమె షర్మిల రాకతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు.
జగన్ ఎవరికీ భయపడరన్న మంత్రి రోజా వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారనడం విడ్డూరంగా ఉందని తెలిపారు.టికెట్ రాని వాళ్లను సైతం వైసీపీ సరైన విధంగానే గౌరవిస్తుందని స్పష్టం చేశారు.