ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కల్పించే వసతులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులపై నిపుణుల కమిటీని నియమిస్తామని ధర్మాసనం తెలిపింది.
నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.అనంతరం పిటిషన్ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అయితే తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.