మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.
అయితే ఎక్కడ కూడా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉపాసన వ్యవహార శైలి అందరికీ నచ్చుతుంది.ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా మెగా పవర్ స్టార్ భార్యగా మెగా కోడలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన ఇటీవల తల్లిగా మారిన సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహం జరిగినటువంటి 11 సంవత్సరాలకు ఉపాసన రాంచరణ్(Ram Charan) తల్లిదండ్రులుగా మారిపోయారు.
వీరికి కుమార్తె జన్మించడంతో తనకు క్లీన్ కారా(Klin kaara) అని నామకరణం కూడా చేశారు.ఈ చిన్నారి జూన్ నెలలో జన్మించినప్పటికీ ఇంతవరకు తన ఫేస్ మాత్రం అభిమానుల కోసం రివీల్ చేయలేదు.
ఇలా 11 సంవత్సరాలు తర్వాత ఉపాసన తల్లిగా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ బుల్లి మెగా వారసురాలని చూడటం కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరో బేబీ కూడా రాబోతుందంటూ ఈమె షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది ఏంటి ఉపాసన మరో బేబీ రాబోతుంది అంటున్నారు కొంపదీసి కాబోతుందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఉపాసన తల్లి కావడం లేదని ఆమె పెద్దమ్మగా ప్రమోట్ అవుతుందని తెలుస్తోంది.ఉపాసనకు ఒక చెల్లెలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఆమె పేరు అన్షుపాల(Anshupala).ఈమె కూడా గత మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు.ఈ వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇకపోతే ఉపాసన చెల్లెలు( Upasana Sister ) తల్లి కాబోతుందని తెలుస్తుంది ప్రస్తుతం ఈమె సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ మోర్ బేబీస్ ఆన్ ద వే అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఉపాసన సోదరికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఈమెకు కొంపతీసి కవలలు పుట్టబోతున్నారా అందుకే బేబీస్ అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు అని మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సీమంతపు వేడుకలు ముంబైలో జరిగాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ముంబైలో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు అలాగే సినీ సెలెబ్రెటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.