తమిళనాడు( Tamil Nadu ) అరవ రాజకీయాలు మహాముచ్చటగా ఉంటాయి.ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మళ్లి ఎన్నికల్లో గెలవాడు.
మళ్లి గెలిచినా పార్టీ ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా నెగ్గదు .ఎవరికి ప్రభుత్వం , అధికారం శాశ్వతం కాదు అని తమిళ ప్రజల తీర్పు ఉంటుంది.అందుకు తగ్గట్టుగానే చాల ఏళ్ళ పాటు కరుణానిధి వర్సెస్ జయలలిత రాజకీయాలు నడిచాయి.ఈ ఇద్దరు రాజకీయాల్లో( politics ) బద్ద శత్రువులు.పైగా ఇద్దరు కూడా సినిమాల నుంచి వచ్చి రాజీకీయాల్లో పండిపోయారు.ఒక్కసారి జయలలిత పార్టీ నెగ్గి ప్రభుత్వంలోకి వస్తే మళ్లి ఎన్నికలు వచ్చే దాకా కరుణానిధి పై కక్ష కట్టి తెలిసిన మరియు తెలియని కేసులు బనాయించి జైలు పాలు చేస్తుంది.
అలాగే మహిళా అని చూడకుండా కరుణానిధి ( Karunanidhi )పార్టీ గెలిస్తే జయలలిత కు చుక్కలు చూపిస్తాడు.ఇది తమిళనాట సర్వసాధారణం.అలాగే కింద స్థాయి నేతలు కూడా ఒకరి పై మరొకరు కత్తులు దూస్తూనే ఉంటారు.జయలలిత పై అసెంబ్లీ లో జరిగిన కీచక పర్వం అందరికి తెలిసిందే.
అలాగే జయలలిత ముసలివాడు, కురువృద్ధుడు అయినా కరుణానిధిని ఈడ్చుకెళ్లి జైల్లో వేయించడం అప్పట్లో యమ హాట్ న్యూస్.ఇలా ఒకరిపై ఒకరు ఎన్ని రోజులైనా కూడా యుద్దాలు చేసుకున్నారు, కేసులు పెట్టుకున్నారు కానీ ఆ పరంపర కరుణానిధి బ్రతికి ఉన్నంత వరకు కొనసాగించారు.
ఇక ఈ విషయం పై ఒకసారి కరుణానిధి అధికారంలో ఉండగా ఎవరో ప్రస్తావించారట.ఎందుకు అంది ఆమె పై కేసులు గట్రా.ఈ కయ్యం పెట్టుకొని సాధించేది ఏముంది.కేసులు వేసుకుంటూ పోతే ఎక్కడ ఆగుతుంది.
వదిలేస్తే పోలేదా అని.కానీ అందుకు కరుణానిధి నవ్వుతు జయలలిత ఒక్క ఫోన్ చేసి ఎందుకు గొడవలు ఆపేద్దాం అంటే నేను ఇప్పుడే ఆపేస్తా కానీ అలా జయలలిత చెప్తుందా? అలా చెప్తే ఆమె జయలలిత అవుతుందా ? పోనీ నేను ఆపితే నేను ఎలా కరుణానిధిని అవుతాను.ఇవి ఎక్కడ ఎవరికోసం ఆగవు.ఆపలేము.అలా జరుగుతూ ఉండాల్సిందే అని చెప్పారట.