ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) కొద్ది రోజుల క్రితం విస్తారంగా వర్షాలు( Rains ) పడటం తెలిసిందే.కాగా మళ్ళి ఇప్పుడు దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటం జరిగింది.
ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.దీంతో డిసెంబర్ రెండుకి తుఫాన్ గా అల్పపీడనం మారనుందని.
డిసెంబర్ 3 నుంచి ఏపీపై తుఫాను ప్రభావం( Cyclone ) ఉండనుందని అధికారులు తెలిపారు.దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నయని స్పష్టం చేశారు.
రాయలసీమ ఇంకా కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అంతేకాదు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.
ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేశారు.తుఫాను ప్రభావం అధికమైతే డిసెంబర్ మొదటి వారంలో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న గమనం తుఫానుగా మారి తీరం వైపు వస్తే… ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు.ఇదే సమయంలో రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.