ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తీసిన అనిమల్ సినిమా( Animal Movie ) వైపే చూస్తుంది.ఎందుకంటే ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ మాత్రం ప్రతి ప్రేక్షకుడిని ఆనందింపచేయడం తో పాటుగా ప్రతి ఒక్కరికి గూస్ బంస్ వచ్చే విధంగా ఈ ట్రైలర్ అనేది డిజైన్ చేయడం వెనక చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
నిజానికి ఈ ట్రైలర్ ని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు.ఎందుకంటే ఒక ట్రైలర్ పర్పస్ ని బట్టి ఎలా ఉండాలి అనేది కరెక్ట్ గా డిజైన్ చేసుకున్నాడు.
ఇక అదే టైప్ లో సినిమా ట్రైలర్ ని ఎలా రివిల్ చేయాలి,ఎక్కడ హై చేయాలి, ఎక్కడ ఎండ్ ఇవ్వాలి అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వడంతో దేశం మొత్తం ఈ సినిమా గురించే అసక్తి గా ఎదురుచూస్తుంది.
ఇక డిసెంబర్ ఒకటోవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా పట్ల ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక హై మూమెంట్ లో ఉన్నాడు.ఈ సినిమా కనక హిట్ అయితే సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు.ఇక ఇదిలా ఉంటే తను తర్వాత చేయాల్సిన స్పిరిట్ సినిమా( Spirit Movie ) గురించి సందీప్ రెడ్డి వంగ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది.
ఎంటి అంటే ఇప్పటికే అనిమల్ మూవీ రన్ రన్ టైం వచ్చేసి మూడు గంటల 23 నిమిషాల 21 సెకండ్లు ఉండడంతో ఇప్పుడు ప్రభాస్ ( Prabhas ) సినిమా రన్ టైం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీదనే ప్రతి ఒక్కరికి చర్చ నడుస్తుంది.అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈ సినిమా కూడా మూడు గంటల పైనే రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కానీ ఏమాత్రం ప్రేక్షకులను బోర్ కొట్టించదు అని సమాధానం ఇస్తున్నాడు.ఇంకా ఆయన మాటలు చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
.