Kapil Dev: మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది.. తల ఎత్తుకోండి.. కపిల్ దేవ్ సంచలన పోస్ట్ వైరల్!

తాజాగా ఆదివారం రోజు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో( Cricket World Cup ) ఆస్ట్రేలియా( Australia ) చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఇండియా( India ) ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఇండియా గెలుస్తుంది అని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.

 After Icc Cricket World Cup Ind Vs Aus Final Kapil Dev S One Sentence Won Every-TeluguStop.com

కానీ ఇండియా ఓటమి పాలవ్వడం క్రికెట్ క్రికెట్ ప్రేమికులు, దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.చాలామంది ఆ బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు.

సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్టులు చేస్తూ బాధను వ్యక్తపరుస్తున్నారు.అయితే ఈ విషయం పట్ల క్రికెటర్లు కూడా చాలా బాధపడడంతో పాటు కొంతమంది గ్రౌండ్ లోనే ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.

Telugu Cricket Cup, Cricketerkapil, Ind Aus, India, Kapil Dev, Rohit Sharma, Sha

ఇటువంటి సమయంలో కపిల్ దేవ్( Kapil Dev ) చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌ సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ తెలిపాడు.ఈ మేరకు కపిల్ దేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.

ఛాంపియన్స్‌లా ఆడారు.సగర్వంగా తల ఎత్తుకోండి.మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదు.మీరెప్పుడో విజేతలుగా నిలిచారు.మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది.రోహిత్‌( Rohit Sharma ) నీ పనిలో మాస్టర్‌ నువ్వు.

Telugu Cricket Cup, Cricketerkapil, Ind Aus, India, Kapil Dev, Rohit Sharma, Sha

భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి.ఇది కష్టకాలమని నాకు తెలుసు.కానీ స్ఫూర్తిని కోల్పోవద్దు.భారత్‌ నీకు మద్దతుగా ఉంది అంటూ కపిల్‌ దేవ్ తన పోస్టులో రాసుకొచ్చారు.చాలామంది పోస్ట్ పై స్పందిస్తూ చాలా బాగా చెప్పారు.మీరు ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు కానీ మా దృష్టిలో మీరు గెలిచినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఆ పోస్ట్ పట్ల నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube