యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొన్నేళ్ల క్రితం వరకు కాంబినేషన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినా ఇప్పుడు మాత్రం మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.
అయితే ఒక సినిమాను రిజెక్ట్ చేశానని తారక్ ఇప్పటికీ బాధ పడుతున్నారట.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను( Boyapati Srinu ) భద్ర సినిమా కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పారు.
అయితే కథ చెప్పినా ఆ సమయానికి బోయపాటి శ్రీనుకు( Boyapati Srinu ) దర్శకుడిగా అనుభవం లేకపోవడంతో పాటు బోయపాటి శ్రీను కథ చెప్పిన విధానంపై కొన్ని అనుమానాలు ఉండటంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు నో చెప్పారు.అయితే ఈ సినిమా రిజెక్ట్ చేశానని భద్ర సినిమా( Bhadra movie ) విడుదలైన తర్వాత ఫీలయ్యానని దమ్ము సినిమా రిలీజ్ సమయంలో చెప్పారు.ఎన్టీఆర్ భద్ర సినిమాలో నటించి ఉంటే ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరేది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది.
దేవర( Devara ), దేవర2 సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తుండటంతో అక్కడ కూడా తారక్ మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
వార్2 సినిమా( War 2 movie ) కోసం తారక్ లుక్ ను సైతం మార్చుకున్నారని సమాచారం అందుతోంది.తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అద్భుతమైన కథలను ఎంచుకుంటున్న తారక్ రాబోయే రోజుల్లో కెరీర్ బెస్ట్ విజయాలు దక్కుతాయేమో చూడాలి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తులో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.