ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి.వాహన కొనుగోలుదారులు పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలు కాకుండా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో 2023 అక్టోబర్ నెలలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్( Electric Scooters ) అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్రగామిగా నిలిచాయి.సెప్టెంబర్ నెలలో 18691 యూనిట్లను విక్రయించిన ఓలా ఎలక్ట్రిక్.( Ola Electric ) అక్టోబర్ నెలలో 22284 యూనిట్లను విక్రయించి, 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు( TVS Electric Scooters ) నిలిచాయి.సెప్టెంబర్ నెలలో 15584 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ అక్టోబర్లో 15603 యూనిట్లను విక్రయించి, 0.1 శాతం స్వల్ప నెలవారీ వృద్ధిని నమోదు చేసింది.ఈ జాబితాలో బజాజ్( Bajaj ) మూడవ స్థానంలో నిలిచింది.
బజాజ్ నుంచి ఒకేఒక ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్( Chetak ) అందుబాటులో ఉంది.సెప్టెంబర్ నెలలో 7097 యూనిట్లను విక్రయించిన బజాజ్ అక్టోబర్ నెలలో 8430 యూనిట్లను విక్రయించి, 18.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది.
ఈ జాబితాలో ఏథర్( Ether ) నాలుగవ స్థానంలో నిలిచింది.సెప్టెంబర్ నెలలో 7151 యూనిట్లను విక్రయించిన ఏథర్, అక్టోబర్ నెలలో 8027 యూనిట్లను విక్రయించి, 12.2 శాతం వృద్ధి రేటును( Greaves ) నమోదు చేసింది.ఈ జాబితాలో గ్రీవ్స్ ఐదవ స్థానంలో నిలిచింది.సెప్టెంబర్ నెలలో 3612 యూనిట్లను విక్రయించిన గ్రీవ్స్, అక్టోబర్ నెలలో 4019 యూనిట్లను విక్రయించి, 11.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకే వాహన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకునేవారు ఈ టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏదో ఒక దానిని కొనుగోలు చేసుకోండి.