ఆర్.మాధవన్( R Madhavan ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.
నటుడిగా, రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సినిమా రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నాడు మాధవన్.ప్రస్తుతం, అతను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FITI) అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.
మంచి వ్యక్తిత్వం గల మాధవన్ భారతీయ సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తాడు.మాధవన్ కుమారుడు కూడా హిందూ సంప్రదాయాలు బాగా ఆచరిస్తాడు.
రంగనాథన్ మాధవన్( Ranganathan Madhavan ) 1970, జూన్ 1న భారతదేశంలోని జంషెడ్‌పూర్‌లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.అతని తండ్రి రంగనాథన్ అయ్యంగార్ టాటా స్టీల్‌లో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కాగా అతని తల్లి సరోజ( Saroja ) బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేశారు.
అయితే మాధవన్ తల్లి సరోజా నుంచే చాలా విలువలను నేర్చుకున్నాడు.ముఖ్యంగా జీవితంలో పాటించాల్సిన మూడు జీవిత సూత్రాలను తెలుసుకున్నాడు వాటిని ఇప్పటికీ అతడు పాటిస్తాడు.ఒక ఈవెంట్ లో ఈ మూడు జీవిత సూత్రాల గురించి అతను పంచుకున్నాడు.అవేంటో తెలుసుకుందాం పదండి.

1.ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించకూడదు.
2.ఎవరినీ ఆర్థికంగా మోసం చేయకూడదు.
3.ఏ వృత్తి చేసే వారైనా సరే ప్రతి ఒక్కరిని గౌరవించాలి.

ఈ మూడు సూత్రాలను తాను జీవితంలో ఎప్పటికీ పాటిస్తానని మాధవన్( Madhavan ) చెప్పుకొచ్చాడు.ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్ వైరల్ గా మారింది.ఇది చూసి చాలామంది ఒక తల్లిగా పిల్లలకు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఇదే అని పేర్కొన్నారు.మాధవన్ మన భారతీయ కల్చర్ ని ( Indian Culture ) ఎంతో గౌరవిస్తారు అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.
ఉత్తమ తల్లి మీరు పుట్టుకతోనే దేవుడి ఆశీర్వాదాలు పొందారు అని ఇంకొకరు కామెంట్ చేశారు.ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చాలామంది మదర్స్ కూడా కామెంట్స్ చేశారు.
తాము కూడా ఇలాంటి వాల్యూస్ తమ పిల్లలకు నేర్పుతామని చెప్పారు.మాధవన్ ఇప్పుడు తమిళ్ హిందీ భాషల్లో చాలా సినిమాలు చేస్తున్నాడు.
వాటిలో శంకరన్ నాయర్, జీడి నాయుడు బయోపిక్ సినిమాలు ఉన్నాయి.
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్( Rocketry: The Nambi Effect ) సినిమాతో ఇటీవలే మాధవన్ సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.అతడి నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో హిట్ అవుతే ఈ నటుడు పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అవుతాడు.