కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందనిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.కేంద్ర కమిటీ నివేదికతో నిర్లక్ష్యం అంతా బట్టబయలు అయిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని రాజకీయం చేసిన మంత్రులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.ఈ క్రమంలో ఇరిగేషన్ మంత్రి చెంపలు వేసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వం మనుగడ అవసరమా? లేదా? అన్నది ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.అదేవిధంగా బీజేపీ బృందం అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.