రాజకీయాల్లో గెలుపోటములను ముందే అంచనా వేయడం కష్టం.ఎందుకంటే ప్రజాభిప్రాయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
అయితే కొందరు నాయకులు మాత్రం ప్రజానాడీని పట్టి గెలుపోటములను ముందే అంచనా వేస్తూ.అందుకు తక్కట్టుగా వ్యూహాలలోనూ, ప్రణాళికలలోను మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.
అలాంటి నాయకుల్లో బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ముందు వరుసలో ఉంటారు.ఆయన రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం చాలా కష్టమనేది అందరికీ తెలిసిందే విషయమే.2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపును ఖచ్చితంగా అంచనా వేసి అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్.ఈసారి ఎన్నికల విషయంలో మాత్రం మునుపటి కాన్ఫిడెంట్ చూపించలేక పోతున్నారు.
మిగిలిన పార్టీల కంటే అభ్యర్థుల ప్రకటన ముందే చేసిన.ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న.కేసిఆర్( CM kcr ) లో ఏదో ఒక మూల ఓసారి ఓటమి భయం కనిపిస్తోందని ఆయన చేసున్న ప్రసంగాలను బట్టి ఇట్టే తెలిసిపోతుంది.గతంలో ఎప్పుడు లేని విధంగా బిఆర్‌ఎస్ ( BRS )ను గెలిపించక పోతే ప్రజలే నష్ట పోతారని, తమను ఓడగొడితే మాకేం నష్టం లేదని, అధికారం ఇతర పార్టీలకు ఇవ్వొద్దని.
ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కేసిఆర్.ఆయన వ్యాఖ్యాలలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందనేది కొందరి అభిప్రాయం.అటు వైపు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.
బిఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానిస్తోంది.గులాబీ పార్టీ నుంచి ఇప్పటికే చాలమంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు.ఇటు ప్రజల్లోనూ సర్వేల పరంగా చూస్తే ఈసారి బిఆర్‌ఎస్ కు కాంగ్రెస్ ( Congress BRS )నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దీంతో అధికారం చేజారుతుందనే బాధ కేసిఆర్ లో కనబడుతున్నట్లు తెలుస్తోంది.అందుకే ఆయన ప్రసంగాల్లోనూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు సంధించడంలోనూ కేసిఆర్ నెమ్మదించారనే వాదన పెరుగుతోంది.
దానికితోడు కేసిఆర్ పాలనపై రాష్ట్రప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.మరి ఈసారి రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.