తెలంగాణ సీఎం కేసీఆర్ ను గద్దె దించాలనే నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.వివేక్ కుటుంబానికి కాంగ్రెస్ తో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.
తమ ఆహ్వానం మేరకు వివేక్ కాంగ్రెస్ లో చేరారని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో వివేక్ చేరికతో కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం చేకూరిందని చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.