టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే. మంచి విష్ణు( Manchu vishnu ) ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
కాగా కన్నప్ప సినిమా( Kannappa movie )మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే.ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమా శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా ప్రారంభమైంది.
పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు పాన్ ఇండియా స్టార్ లో నటిస్తున్నారు.మలయాళ స్టార్ మోహన్ లాల్,( Mohanlal ) కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం న్యూజిలాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.రీసెంట్ గానే చిత్ర యూనిట్ న్యూజిలాండ్ కు ఎనిమిది భారీ కంటైనర్లను తరలించారు.అక్కడ ఒక భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేయబోతున్నారని సమాచారం.ఈ యాక్షన్ సీక్వెన్స్ ను విష్ణుపై షూట్ చేస్తున్నారు.ఈ క్రమంలో డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకి దూసుకొచ్చిందని తెలుస్తోంది.
దీంతో తీవ్రమైన ప్రమాదం జరగకపోయినా విష్ణు చేతికి బలమైన గాయాలయ్యాయని సమాచారం.దీంతో వెంటనే విష్ణును యూనిట్ ఆస్ప్రత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
విష్ణు గాయాలపాలవడం, వైద్యులు కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని అనడంతో చిత్రబృందం చిత్రీకరణను నిలిపివేసిట్టు తెలుస్తోంది.ఈ విషయం తెలియడంతో మంచు విష్ణు అభిమానులు ఆందోళన పడుతున్నారు.త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికన కోరుకుంటున్నారు.
e సినిమాను దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.కాగా మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే ఇందులో స్టార్ హీరోయిన్లు నయనతార అనుష్క ( Nayanthara Anushka Shetty )కూడా కనిపించబోతున్నారు.