సీనియర్ నటి విజయశాంతి ( vijayashanthi )గురించి తెలుగు జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.టాలీవుడ్లో మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో( lady oriented movies ) జనాలను మెప్పించిన ఘనత ఆమెకే దక్కుతుంది.
ఒకానొక సమయంలో ఆమె వరుస సూపర్ డూపర్ హిట్లు కొట్టి, తెలుగు బడా హీరోలకే సవాల్ గా మారిందంటే మీరు నమ్ముతారా? హీరోలకు ధీటుగా యాక్షన్ ఎపిసోడ్లలో నటించి వారికి తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్‌గా ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నటి విజయశాంతి అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.
కాగా ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 45 సంవత్సరాలు పూర్తి అయింది.చాలా యేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో( Sarileru Neekevvaru ) సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విజయశాంతి.ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే.
ఇక విజయశాంతి వ్యక్తిగత జీవితం చాలమందికి తెలియదు.ఆమె జూన్ 24, 1966లో ఆమె వరంగల్లో జన్మించి మద్రాసులో పెరిగారు.
ఆమె పేరు వెనక కూడా ఆసక్తికర స్టోరీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? విజయశాంతి అసలు పేరు శాంతి.అయితే విజయశాంతి పిన్ని అయిన విజయలలిత ( Vijayalalita )కూడా అలనాటి తెలుగు నటి.ఆమె ప్రోత్సాహంతోనే విజయశాంతి సినిమా రంగంలో అడుగు పెట్టింది.
అలా విజయశాంతి తన 7వ సంవత్సరంలోనే బాలనటిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆమెను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేసింది మాత్రం ప్రముఖ తమిళ దర్శకుడు భారతీయ రాజా( bharateeya raja ).విజయశాంతి తన శాంతి పేరుకు ముందు తన పిన్ని విజయలలిత పేరులోని విజయ అనే పేరును యాడ్ చేసుకుందని చాలమందికి తెలియదు.ఆమె మీద వున్న విపరీతమైన అభిమానంతోనే శాంతి కాస్త విజయశాంతిగా మారారు అని చెబుతూ వుంటారు.ఇక అలా ఆమె పేరు మార్చుకున్న తరువాత ఆమె అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్ ఎదిగిపోయారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.ఆమెకి సినిమా జీవితం సంతృప్తి ఇచ్చినప్పటికీ ఆమె రాజకీయ జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదనే చెప్పుకోవాలి.
ఇక్కడ ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.