సింగ్టావో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఒక నీచపు పని చేశాడు.బీర్ ట్యాంక్‌లో మూత్ర విసర్జన చేస్తూ ఇతడు కెమెరాకు చిక్కాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చైనాలో దుమారం చెలరేగింది.చైనా, ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన బీర్ బ్రాండ్‌లలో సింగ్టావో ఒకటి.
తమ బీర్‌ను స్వచ్ఛమైన పదార్థాలు, సహజ నీటి బుగ్గలతో తయారు చేస్తామని కంపెనీ గర్వంగా చెప్పుకుంటుంది.కానీ స్వచ్ఛమైన మూత్రంతో ఈ బీరు తయారవుతుందని తమకు ఇప్పుడే తెలిసిందని వీడియో చూసిన వారు మండిపడుతున్నారు.
గురువారం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కంపెనీ యూనిఫాం, హెల్మెట్‌లో ఉన్న వ్యక్తి గోడపైకి ఎక్కి పెద్ద మెటల్ కంటైనర్‌లోకి మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపించింది.స్థానిక వార్తా సంస్థ ప్రకారం, ఈ సంఘటన పింగ్డు సిటీలోని సింగ్టావో బీర్ నెం.3 ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది.అయితే, మరో వ్యాపార సంస్థ వీడియోలో ఉన్న వ్యక్తి, దానిని చిత్రీకరించిన వ్యక్తి సింగ్‌టావోలోని ఉద్యోగులు కాదని, మరో కంపెనీకి చెందిన సబ్‌కాంట్రాక్టర్లని నివేదించింది.
ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే పింగ్డు సిటీ మార్కెట్ సూపర్‌విజన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరో విచారణ ప్రారంభించింది.నిజానిజాలు రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాము పోలీసులను అప్రమత్తం చేసి విచారణకు సహకరించామని సింగ్టావో తెలిపారు.బీరు ట్యాంక్‌కు సీల్ వేసి, కలుషిత బీర్‌ను ప్రజలకు విక్రయించడం లేదని వారు తెలిపారు.
ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణను పటిష్టం చేస్తామని చెప్పారు.ఈ వీడియో చైనీస్ నెటిజన్లలో ఆగ్రహం, అసహ్యం కలిగించింది, వారు చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన వీబోపై తమ దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.