టెన్షన్ పెడుతున్న కాంగ్రెస్ ..  కేసిఆర్ ప్లాష్ సర్వేలు ? 

గెలుపు ధీమా తో ఉన్న బీఆర్ఎస్( BRS ) అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ రోజురోజుకు బలం పుంజుకుంటూ ఉండడంపై ఆందోళన చెందుతున్నారు . బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

 Congress Is Putting Tension Kcr Flash Surveys , Telangana, Telangana Governme-TeluguStop.com

తెలంగాణలో బిజెపి ప్రభావం కనిపించినా,  ఇప్పుడు ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్,  బీఆర్ఎస్ పార్టీల మధ్య అని తేలిపోవడంతో కాంగ్రెస్ గ్రాఫ్ ఎంతవరకు పెరిగింది అనే దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.  ముఖ్యంగా కాంగ్రెస్( Congress) నిర్వహిస్తున్న సభలు,  సమావేశాలు,  బస్సు యాత్ర నిర్వహించిన ప్రాంతాల్లో జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది ? అలాగే కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సమావేశాలకు జనం నుంచి ఏ స్థాయిలో ఆదరణ వచ్చింది ?  జనాల అభిప్రాయం ఏమిటి అనేది ఫ్లాష్ సర్వేల ద్వారా తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారట.

Telugu Brs, Flash, Rahul Gandhi, Telangana-Politics

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల పై ప్రజల్లో సానుకూలతో ఏర్పడిందని కేసీఆర్ గుర్తించారు.ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ పథకాలకు బాగా ఆకర్షితులవుతున్నారని గ్రహించిన కేసీఆర్ , కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు కౌంటర్ గా మేనిఫెస్టోను ప్రకటించారు.  ఈ మేనిఫెస్టో ప్రకటన తర్వాత జనాల్లో కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్( BRS ) పై జనాల్లో ఉన్న అభిప్రాయాలు ఏమిటనేది ఫ్లాష్ సర్వేల ద్వారా తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారట .ముఖ్యంగా తెలంగాణలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న రోడ్ షో ,  బైక్ ర్యాలీ, బస్సు యాత్ర పై ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ? ఇదే సమయంలో బి ఆర్ ఎస్ గురించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది తెలుసుకునేందుకు సర్వేలు మొదలుపెట్టారట.

Telugu Brs, Flash, Rahul Gandhi, Telangana-Politics

ఈనెల 15న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ( CM kcr )వరుసగా నాలుగు రోజులు పాటు జిల్లాలో పర్యటించారు.అనేక బహిరంగ సభలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు, మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేసే కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించారు.  ఈ ప్రకటనలపై జనాల్లో ఉన్న అభిప్రాయాల పైన కెసిఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube