తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో మరో లొల్లి మొదలైంది.టికెట్ల కేటాయింపులో ఈసారి బీసీ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థుల జాబుతాను ప్రకటించేందుకు పిసిసి స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుండగా , ఇప్పుడు అకస్మాత్తుగా బీసీ నినాదం తెరపైకి వచ్చింది.ఈ మేరకు కాంగ్రెస్ బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు.
ఈసారి తమ కోటా సీట్లు పెంచాల్సిందేనని డిమాండ్ చేయడంతో పాటు, దీనిని సాధించుకునేందుకు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.హై కమాండ్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ( Congress )ప్రకటించబోయే 119 అభ్యర్థుల జాబితాలో కనీసం 40 సీట్లు అయినా బీసీ నేతలకు కేటాయించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు బీసీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతలను కలుసుకునేందుకు ఢిల్లీకి బయలుదేరారు .ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ బీసీ లీడర్లు ఈ విధమైన డిమాండ్ తీసుకురావడం వెనుక కారణాలు ఏమిటంటే… తెలంగాణ లో 50% పైగా ఉన్న బీసీ జనాభా కు తగ్గట్టుగానే అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ప్రతిసారి గెలుపు గుర్రాల పేరుతో బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అభ్యర్థుల ప్రకటనకు ముందుగానే బిసి నేతలు అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇప్పటికే ఇదే అంశంపై గాంధీభవన్ వేదికగా ఓసారి బీసీ నేతలంతా సమావేశం అయ్యారు.
తాజాగా ఢిల్లీలో అగ్రనేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు.పొలిటికల్ అఫైర్స్ కమిటీలోను ఇదే విషయమై చర్చించి ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే బీసీ నేతలు బలంగా ఉన్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు.జనగామ నియోజకవర్గంలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ను కాదని కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి( Kommuri Pratap Reddy ) టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది .హుస్నాబాద్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎల్బీనగర్ సీటు పై మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, నల్గొండ అసెంబ్లీ సీటుపై చెరుకు సుధాకర్ వంటి వారు ఆశలు పెట్టుకున్నారు.ఈ సీట్లు చేజారిపోకుండా ముందుగానే బీసీ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.