ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )తెలంగాణపై కూడా దృష్టి పెట్టరా? తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీకి రంగం సిద్దమౌతోందా ? తెలంగాణలో పవన్ వ్యూహాలు ఏంటి ? ఇలాంటి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఎందుకంటే మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేసేందుకు పవన్ అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని గతంలోనే క్లారిటీ ఇచ్చారు పవన్. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికి యాక్టివ్ గా కనిపించకపోవడంతో ఆ నిర్ణయం విరమించుకున్నారనే వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పార్టీని( Janasena party ) బరిలో దించేందుకు పవన్ శీఉద్దమౌతున్నారట.దీంతో తెలంగాణ రాజకీయలు వేడెక్కాయి.ఎందుకంటే ఈసారి తెలంగాణ ఎన్నికలపై టీడీపీ( TDP ) కూడా గట్టిగా ఫోకస్ పెట్టింది.అలాగే బిజెపి ఎటు తెలంగాణ అధికారం కోసం పోటీ పడుతోంది.ఈ రెండు పార్టీలతో కూడా జనసేన పొత్తులో ఉంది.ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా బిజెపి, టీడీపీలతో( TDP ) పవన్ పొత్తు ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్ళడంపై గతంలో బండి సంజయ్ వ్యతిరేకంగా స్పందించారు.

జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితంగా ఉంటుందని, తెలంగాణలో మాత్రం బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని చెప్పుకొచ్చారు.దీంతో బీజేపీతో పొత్తు ఉండదనే సంగతి స్పష్టమైంది.కానీ ఇటీవల టీడీపీతో ఏపీలో పవన్ పొత్తుపెట్టుకోవడంతో.
తెలంగాణలో టీడీపీ మరియు జనసేన కలిసి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్( KTR ) తో కూడా పవన్ కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పవన్( Pawan Kalyan ) బిఆర్ఎస్ తో పొత్తు ఆలోచన చేసే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.మరి తెలంగాణ విషయంలో పవన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.