గుర్రాలకూ అందుబాటులో షూ.. ధర వింటే కళ్లు తిరగడం ఖాయం

పూర్వ కాలం నుంచి గుర్రాలు( Horses ) మనుషులకు రవాణా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.ఎలాంటి ప్రాంతాలైనా గుర్రాలు పరుగులు తీస్తాయి.

 Shoes Available For Horses, Horse, Shoes, Latest News, Viral Latest, News Viral,-TeluguStop.com

అయితే గుర్రాలు కూడా జీవులే.వాటికి కూడా సాధకబాధకాలు ఉంటాయి.

ముఖ్యంగా గుర్రాలను వినియోగించే వారు వాటి పాదాలకు నాడాలు కొడుతుంటారు.ఆ సమయంలో గుర్రాలు ఎంతో బాధను అనుభవిస్తాయి.

పూర్వ కాలంలో ప్రస్తుతం ఉన్నంత టెక్నాలజీ ( Technology )లేదు.అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం మనుషులకు అన్నీ ఎక్కువ కష్టపడకుండా శ్రమ తప్పే టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం.అయితే ఇలాంటి సమయంలో కూడా గుర్రాలకు నాడాలు కొట్టడం సరి కాదని జంతు సంరక్షణ సంస్థలు వాదిస్తున్నాయి.

దీనిపై ప్రముఖ షూ మేకర్, స్నీకర్స్‌ కాస్ట్యూమ్‌ స్పెషలిస్ట్‌ మార్కస్‌ ఫ్లాయిడ్ దృష్టి సారించారు.గుర్రాలకు ఖరీదైన షూలను ఆయన తయారు చేశారు.

Telugu Horse, Latest, Shoes-Latest News - Telugu

కుక్కల కోసం స్నీకర్, షూలు ( Sneaker, shoes )ఇప్పుడు సర్వసాధారణం.గుర్రాల కోసం కూడా షూలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.కెంటకీలో ఉన్న 39 ఏళ్ల స్నీకర్ డిజైనర్ మార్కస్ ఫ్లాయిడ్ గుర్రాల కోసం ప్రత్యేకమైన షూలను రూపొందించారు.గుర్రాల పాదాలకు వీటిని పెడితే చాలా అందంగా ఉన్నాయి.

మనుషుల తరహాలోనే వాటికి కూడా ఖరీదైన బ్రాండెడ్ షూలను తయారు చేశారు.అవి ధరిస్తే గుర్రాలు ఎలాంటి భూ ఉపరితలంపై అయినా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతాయి.

Telugu Horse, Latest, Shoes-Latest News - Telugu

వాటికి అనువుగా ఉండేలా వీటిని రూపొందించారు. ‘హార్స్‌ కిక్స్‌’ ( Horse Kicks )పేరుతో వీటిని మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు.అంతేకాకుండా హార్స్‌కిక్‌లెక్స్.కామ్ వెబ్‌సైట్‌లో కూడా దీనిని మనం ఆర్డర్ చేయొచ్చు.వీటితో పాటు ‘ఈజీ బూస్ట్ -350′, ‘న్యూ బ్యాలెన్స్‌-650′ ( ‘Easy Boost-350’, ‘New Balance-650’ )పేరుతో మరికొన్ని స్నీకర్ మోడల్స్ గుర్రాలే కోసం రూపొందించారు.గుర్రాల పాదాలకు అనుగుణంగా షూలను తయారు చేసి ఇస్తారు.

అయితే వీటి ధర కూడా చాలా ఎక్కువ ఉంది.అమెరికాలో వీటి ప్రారంభ ధర 1,200 డాలర్లుగా ఉంది.

దీనిని భారత కరెన్సీలో చూస్తే రూ.లక్ష నుంచి ప్రారంభం అవుతాయి.ముఖ్యంగా రేసుల్లో పాల్గొనే గుర్రాల కోసం వీటిని ఎక్కువ మంది ఆర్డర్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube