ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల చిట్ చాట్ నిర్వహించారు.వైసీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
అయితే తాము వైసీపీ ట్రాప్ లో పడలేదని పయ్యావుల చెప్పారు.ఈ క్రమంలోనే సభలో హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
కోటంరెడ్డిని టార్గెట్ చేసేలా వైసీపీ సభ్యులు వ్యవహారించారని మండిపడ్డారు.చంద్రబాబు అరెస్టుపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.
అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని తెలిపారు.