మహిళ బిల్లుతో కే‌సి‌ఆర్ ఇరుకున పడ్డారా ?

చట్ట సభలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే అంశం గత కొన్నాళ్లుగా తరచూ చర్చకు వస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు( Womens Reservation Bill ) మొదటి ప్రవేశ పెట్టగా అప్పుడు రాజ్యసభ ఆమోదం లభించినప్పటికి లోక్ సభ ఆమోదం పొందలేదు.

 Is Kcr Stuck With The Women's Bill, Womens Reservation Bill , Bjp , Cm Kcr ,-TeluguStop.com

దాంతో మహిళ బిల్లు అప్పటి నుంచి మరుగున పడుతూ వచ్చింది.అయితే ఈ మద్య కాలంలో మహిళా బిల్లుపై బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత( Kalvakuntla Kavitha ) పోరాటం చేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు మహిళ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం ఉంది.

అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Telugu Cm Kcr, Womens-Politics

ఎందుకంటే కేటాయించాల్సిన సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్డ్ చేయాల్సి ఉంటుంది, 545 పార్లమెంట్ స్థానాలకు గాను 179 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.ఇక రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలలో 39 స్థానాలు, అలాగే ఏపీలో 175 స్థానాలకు గాను 58 స్థానాలు మహిళల కోసం రిజర్వ్డ్ చేయాలి.అయితే అభ్యర్థులను ప్రకటించని పార్టీలకు ఎలాంటి సమస్య ఉండదు గాని ఇప్పటికే అభ్యుర్థులను ప్రకటించిన ప్రకటించిన పార్టీలు మాత్రం గందరగోళంలో పడే అవకాశం ఉంది.

ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

Telugu Cm Kcr, Womens-Politics

అందుకే బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్( CM KCR ) తమ పార్టీకి సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించారు కూడా.మొత్తం 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.అందులో మహిళలకు కేవలం 7 స్థానాలను మాత్రమే కేటాయించారు.

ఈ నేపథ్యంలో మహిళా బిల్లు ఆమోదం పొందితే ప్రకటించిన స్థానాలపై మళ్ళీ మార్పులు చేయాల్సి ఉంటుంది గులాబీ బాస్.దాంతో ఆయా నియోజిక వర్గాల్లో బి‌ఆర్‌ఎస్ ప్రకటించే అభ్యర్థుల విషయంలో తీవ్ర అసంతృప్తి, అసహనం పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే తొలి జాబితాలో సీట్లు దక్కని వారు పార్టీ నుంచి జరుకుంటున్నారు.ఇప్పుడు ఆల్రెడీ సీట్లు కన్ఫర్మ్ అయిన వారిలో కూడా ఇప్పుడు ఆందోళన మొదలైందట.మరి మొత్తానికి అభ్యర్థులను ముందుగానే ప్రకటించి గులాబీ బాస్ ఇరుకున పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube