తెలుగు సినీ హీరో జగపతిబాబు( Jagapathi babu ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా జగపతిబాబు ప్రభాస్( Prabhas ) గురించి ప్రభాస్ కుటుంబం గురించి మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు( Krishnam Raju ) గారు, ప్రభాస్ మాత్రమే కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా గొప్ప వాళ్లేనని తెలియజేశారు.కృష్ణంరాజు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వంలో మనం 20% నేర్చుకున్న చాలని ఈయన ఆ కుటుంబం పై ప్రశంసలు కురిపించారు.
ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నప్పటికీ వారికి ఎన్ని అవార్డులు ఎన్ని పురస్కారాలు వచ్చినా వారిలో ఏమాత్రం గర్వం కనిపించదు.ఒక ప్రభాస్ విషయంలో మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సాధారణంగా ఉంటారని జగపతిబాబు ( Jagapathi babu ) తెలియజేశారు.ఇక ప్రభాస్ ఎవరికైనా సహాయం చేయాలి అంటే ముందు వరుసలో ఉంటారు.ఆయనకు పంచడమే తప్ప తిరిగి అడగడం ఇప్పించుకోవడం అసలు తెలియదని జగపతిబాబు తెలియజేశారు.ఇక ప్రభాస్ తో తనకు వ్యక్తిగతంగా ఒక మంచి అనుబంధము ఉందని కూడా ఈయన తెలియజేశారు.
ఒకానొక సమయంలో నా ఇబ్బందుల కారణంగా నేను ఎంతో సతమతమవుతూ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాను.అలాంటి సమయంలో తనకు ప్రభాస్ ( Prabhas ) తో మాట్లాడాలనిపించింది.ఆ సమయంలో ఆయన జార్జియాలో ఉన్నారు.
నాతో చెప్పు డార్లింగ్ నేనున్నాను కదా అంటూ మాట్లాడారు.ఇక ఆయన ఇండియా తిరిగి వచ్చిన తర్వాత వెంటనే నన్ను కలిశారు.
ఆ సమయంలో ప్రభాస్ మాటలు నాకు ఎంతో ఉపశమనం కలిగించాయి.ఆ విధంగా నేను డిప్రెషన్ లో ఉన్న సమయంలో ప్రభాస్ తనకు అండగా నిలిచి నన్ను ఆ సమస్య నుంచి డిప్రెషన్ నుంచి బయట పడేశారు అంటూ ఈ సందర్భంగా జగపతిబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.