దాదాపు ప్రతి ఒక్కరిలోనూ హెయిర్ ఫాల్( Hair fall ) అనేది కామన్ గా ఉంటుంది.అయితే కొందరిలో మాత్రం ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూ ను వినియోగించడం, తల స్నానం సమయంలో చేసే పొరపాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు హెవీగా రాలిపోతూ ఉంటుంది.దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతుంటారు.
కానీ టెన్షన్ వద్దు.జుట్టు రాలడాన్ని అరికట్టి హెయిర్ గ్రోత్ ను పెంచడానికి నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది.కేవలం రెండు స్పూన్ల నెయ్యి తో హెయిర్ ఫాల్ కు ఈజీగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ నెయ్యిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి( Ghee ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలిఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్య దెబ్బకు కంట్రోల్ అవుతుంది.
నెయ్యి లో ఉండే ప్రోటీన్లు, జింక్, విటమిన్ ఈ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ గా మారుస్తాయి. హెయిర్ గ్రోత్ ( Hair growth )ను ప్రోత్సహిస్తాయి.ఫలితంగా జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారో.ఎన్ని విధాలుగా ప్రయత్నించిన జుట్టు రాలడం ఆగట్లేదని సతమతం అవుతున్నారో.
వారు తప్పకుండా నెయ్యిని పైన చెప్పిన విధంగా ఉపయోగించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.