అభం శుభం తెలియని చిన్నారులను కూడా కామంధులు వదలడం లేదు.బాలికపై కూడా అత్యాచారాలకు పాల్పడుతూ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు.
ఇటీవల మైనర్ బాలికపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఇండియాలో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువయ్యాయి.
కొంతమంది చిన్నారులకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నారు.మరికొంతమంది బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.
వారి వరసలు లేకుండా తమ కామ కోరికలు తీర్చుకునేందుకు బరి తెగిస్తున్నారు.

ఇలాంటి సమయంలో బాలికలకు( Girls ) ఏది గుడ్ టచ్.ఏది బ్యాడ్ టచ్ అనే దానిపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.దీని వల్ల బాలికలు ఎదుటివారి కదలికలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడతారు.
దీనికి సంబంధించి ఒక విద్యార్థికి ఒక టీచరమ్మ పాఠం చెప్పింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media)లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో చిన్నారులకు అర్థమయ్యే బాషలో ఆమె చేసి చూపించారు.ఛాతిపై తడమటం, గట్టిగా కౌగిలించుకోవడం, శారీరకంగా లేదా మానసికంగా హాని కలిగించేలా అసభ్యంగా తాకడం లాంటివి చేసేటప్పుడు పిల్లలు ఎలా ప్రతిఘటించాలో పిల్లలకు చేసి చూపించారు.

ఇక ఆప్యాయంగా తాకడం, దురుద్దేశపూరితంగా ముట్టుకోవడం మధ్య తేతాడు విద్యార్థినులకు టీచరమ్మ( Teacher ) అర్ధమయ్యేలా చేసి చూపించారు.ఇది ఏ స్కూల్ లో జరిగింది.ఎక్కడ జరిగింద అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు.కానీ వీడియో మాత్రం ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది.దీంతో ఈ టీచరమ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తన్నాయి.టీచర్లు ప్రతి స్కూల్ లో బాలికలకు వీటి గురించి అవగాహన కల్పించాలని చెబుతున్నారు.
చిన్నారులపై లైంగిక దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి.తెలిసినవారి నుంచి పిల్లలకు వేధింపులు ఎదురవుతున్నాయి.
దీంతో పిల్లలకు శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం.అవగాహన ఉండటం వల్ల పిల్లలు జాగ్రత్త పడతారు.







