గ్లోబల్ రీసెర్చ్ అండ్ అడ్వైసరీ ఫిర్మ్ ఓమ్డియా(Omdia) ఏటా మోస్ట్ పాపులర్ ఫోన్ల లిస్ట్( Most Popular Smartphones ) రిలీజ్ చేస్తుంటుంది.ఈ ఏడాదికి కూడా ఒక లిస్టు రిలీజ్ చేసింది.
ఓమ్డియా ఇటీవల నిర్వహించిన సర్వేలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్( iPhone 14 Pro Max ) ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత పాపులారిటీ పొందిన స్మార్ట్‌ఫోన్ అని తేలింది.యాపిల్ 2023 ప్రథమార్ధంలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్ యూనిట్లను 2.65 కోట్లకు పైగా విక్రయించింది.రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14 ప్రో, ( iPhone 14 Pro ) ఆ తర్వాతి స్థానాల్లో ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మొబైల్స్ హైయెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ గా నిలిచాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ A14( Samsung Galaxy A14 ) ప్రపంచంలోని ఫిఫ్త్ మోస్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.శామ్‌సంగ్ 2023 మొదటి అర్ధ భాగంలో 1.2 కోట్ల యూనిట్లను విక్రయించింది.ఆరవ అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా( Samsung Galaxy S23 Ultra ) కావడం విశేషం.
2023లో ప్రపంచంలో హైయ్యెస్ట్ పాపులారిటీ దక్కించుకున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ ఒకసారి చూసుకుంటే, 1) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, 2) ఐఫోన్ 14 ప్రో, 3) ఐఫోన్ 14, 4) ఐఫోన్ 13, 5) ఐఫోన్ 13 ప్రో, 6) శామ్‌సంగ్ గెలాక్సీ A14, 7) శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, 8) షియోమీ 12 ప్రో, 9) గూగుల్ పిక్సెల్ 6 ప్రో, 10) వన్‌ప్లస్ 10 ప్రో ఉన్నాయి.
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తగ్గుతోందని, అయితే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోందని సర్వే పేర్కొంది.మెరుగైన ఫీచర్లు, పనితీరుతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ల కోసం వినియోగదారులు ఎక్కువ డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉండటమే దీనికి కారణమని వివరించింది.