నాలుగో రోజు ఖుషి మూవీ కలెక్షన్లు ఇంత ఘోరమా.. విజయ్, సమంతలకు భారీ షాక్ తగిలిందా?

విజయ్ దేవరకొండ, ( Vijay Deverakonda )సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ మొదటి మూడు రోజులు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.అయితే వీకెండ్ లో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధించిన ఖుషి మూవీ వీక్ డేస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైంది.

 Kushi Movie 4th Day Collections Details Here Goes Viral In Social Media , Shi-TeluguStop.com

సోమవారం రోజు ఖుషి మూవీ కలెక్షన్లు కోటి రూపాయల షేర్ కలెక్షన్లకు అటూఇటుగా ఉన్నాయి.

Telugu Kushi, Murli Sharma, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడుతుండటం కూడా ఖుషి మూవీ ( kushi movie )కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటంగమనార్హం.విజయ్, సమంతలకు భారీ షాక్ తగిలిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వర్షాలు తగ్గితే మాత్రమే ఖుషి కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

సెకండ్ వీక్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం తేలే అవకాశం ఉంటుంది.

విజయ్, సమంత( Samantha ) కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఈ జోడీ అద్భుతంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్, సామ్ ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.విజయ్, సామ్ ఖుషి సినిమా పాజిటివ్ రిజల్ట్ తో తర్వాత సినిమాల కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

త్వరలో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Telugu Kushi, Murli Sharma, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

విజయ్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే క్షణం కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్లు వినిపిస్తున్నాయి.విజయ్, సామ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఖుషి సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి.ఆ పొరపాట్లను సరిదిద్దుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube