విదేశాల్లో నివసిస్తున్న భారతీయులతో పాటు భారతదేశాన్ని సందర్శించే విదేశీయులు వీసా, కాన్సులర్ సర్వీసుల( Visa ,consular services ) కోసం ఒక్కోసారి తక్కువ, మరోసారి ఎక్కువ డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది.ఈ సేవలను అందించే కంపెనీలు సొంత వృద్ధి కోసం స్వార్థపూరితమైన ధరలు వసూలు చేయడమే దీనికి కారణం.
అయితే ఈ సమస్యను గుర్తించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ( Ministry of External Affairs ) (MEA) వీసా, కాన్సులర్ సేవలను అందించే కంపెనీల సెలక్షన్ నిబంధనలను కఠినతరం చేసింది.సాధారణంగా కొన్ని కంపెనీలు సేవలకు చాలా తక్కువ ధరలను వసూలు చేయడం ద్వారా కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటాయి.
మార్కెట్లో నంబర్ వన్ అయిన తర్వాత ధరలను భారీగా వసూలు చేస్తాయి.దీనినే బిజినెస్ పరిభాషలో ప్రిడేటరీ ప్రైసింగ్ అంటారు.
దీనివల్ల సర్వీసులలో క్వాలిటీ తగ్గుతుంది.ఎందుకంటే కంపెనీలు తమ ధరలను తక్కువగా ఉంచడానికి క్వాలిటీని కూడా తగ్గించవచ్చు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ సేవలు అధిక నాణ్యతతో, విశ్వసనీయంగా, సురక్షితంగా ఉండేలా చూడాలని కోరుకుంటుంది.అంటే ఎంచుకున్న కంపెనీలు ఈ సేవలను అందించడానికి అవసరమైన నైపుణ్యం, అనుభవం కలిగి ఉండాలి.
వారు తప్పనిసరిగా మంచి పేరును కలిగి ఉండాలి, వారి కస్టమర్ల వ్యక్తిగత డేటాను రక్షించగలగాలి.
భారతదేశానికి వచ్చే ప్రయాణికులందరికీ మంచి అనుభూతిని అందించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.ఉన్నతమైన, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేవలను అందించేలా చూడాలనుకుంటోంది.భారతదేశం అనేక రంగాలలో గ్లోబల్ లీడర్‌గా ( global leader )నిలుస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అర్థం చేసుకుంది.
అందుకే మంచి పేరు, ఇమేజ్‌ని కాపాడుకోవడానికి, ప్రయాణికులందరికీ హై క్వాలిటీ సర్వీసులను అందించడం చాలా అవసరమని భావిస్తోంది.సర్వీస్ ప్రొవైడర్ల క్వాలిటీపై దృష్టి సారించడం ద్వారా నాణ్యమైన సేవలను నిర్ధారించడం కుదురుతుందని, ప్రజల విశ్వాసాన్ని కొనసాగించేలా చూసుకోవచ్చని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.