సమాజంలో మనిషి ప్రాణాలకు విలువ అనేది లేకుండా పోతోంది.చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ వయసు వారినైనా బెదిరించి ప్రాణాలు తీసే వారి సంఖ్య రోజుకు పెరుగుతూ పోతోంది.
ఈ మధ్యకాలంలో యువత అధిక సంఖ్యలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు.కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే మరికొందరు దారుణమైన హత్యలకు గురవుతున్నారు.
ఇలాంటి కోవలోనే తోటి స్నేహితుడిని డబ్బుల కోసం అత్యంత దారుణంగా ఎనిమిదవ తరగతి విద్యార్థులు చంపేసిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.పశ్చిమబెంగాల్( West Bengal ) రాష్ట్రంలోని నడియా జిల్లాలో డబ్బుల కోసం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు తోటి స్నేహితుడిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు.ఆ డబ్బులతో గేమ్స్ ఆడేందుకు కంప్యూటర్ను కొనుగోలు చేద్దామని అనుకున్నారు.తోటి స్నేహితుడిని కిడ్నాప్ చేసి ఆమె తల్లికి ఫోన్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు.
అయితే కిడ్నాప్( Kidnap ) గురైన బాలుడి తల్లి తన భర్త ను చిన్న ఉద్యోగం చేస్తూ అతని సోదరుని ఇంట్లో నివాసం ఉంటోంది.తన వద్ద డబ్బులు లేవని చెప్పినా ఆ కిడ్నాప్ చేసిన పిల్లలు వినకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది.

శుక్రవారం సైకిల్ పై తన స్నేహితుల దగ్గరికి వెళ్లిన కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని, చాలాసేపటి తరువాత ఫోన్ చేసి తన కొడుకును కిడ్నాప్ చేశామని డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు( Police ) రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఈ ముగ్గురు విద్యార్థులు తమ స్నేహితుడిని పిలిపించి కిడ్నాప్ చేసి మూడు లక్షలు కావాలని ఆ బాలుడి తల్లికి డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఆమె ఇచ్చిన డబ్బుతో గేమింగ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని ఆ పిల్లలు భావించారని తెలిపారు.ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ బాలుడిని అత్యంత దారుణంగా చంపేశారు.
ఆ బాలుడిని చంపేముందు చివరి కోరిక అడిగి తెలుసుకుని రసగుల్లాలు, కూల్ డ్రింక్స్ కొనిపెట్టారు.తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.