సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) స్మారక నాణేన్ని నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే.కేంద్ర ఆర్థిక శాఖ ముద్రించిన ఈ నాణేం ధర ధర చెక్క డబ్బాతో 4850 రూపాయలుగా ఉండగా ప్రూఫ్ ఫోల్డర్ ప్యాక్ లో ఉన్న నాణేం ధర 4380 రూపాయలుగా ఉంది.
యూ.ఎన్.సీ ఫోల్డర్ ప్యాక్ లో ఉన్న నాణేం ధర మాత్రం 4050 రూపాయలుగా ఉంది.50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్ మిశ్రమంతో ఈ నాణేన్ని తయారు చేయడం జరిగింది.
ఈ నాణేనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్ సైట్ ద్వారా ఈ నాణేన్ని కొనుగోలు చేయవచ్చు.నేరుగా ఈ నాణేన్ని కొనుగోలు చేయాలని భావించే వాళ్లు సైఫాబాద్, చెర్లపల్లిలో ఉన్న మింట్ విక్రయ కౌంటర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఈ మేరకు ప్రభుత్వ నాణేల ముద్రణా కేంద్రం నుంచి ఒక ప్రకటన వెలువడింది.
నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) అభిమానులకు ఈ నాణేం కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
సాధారణ నాణేలకు, స్మారక నాణేలకు మధ్య చాలా తేడా ఉంది.జాతి చరిత్రపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ వ్యక్తులకు నివాళిగా స్మారక నాణేలను విడుదల చేయడం జరుగుతుంది.ఎన్టీఆర్ స్మారక నాణేం( NTR Commemorative Coin ) సీనియర్ ఎన్టీఆర్ చేసిన అసాధారణ సేవలకు నివాళులు అర్పిస్తుందని చెప్పవచ్చు.https://www.indiagovtmint.in/en/commemorative-coins/ వెబ్ సైట్ ద్వారా ఈ నాణినికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
అయితే నాణేన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే కారణంతో వ్యక్తిగత డిమాండ్ల విషయంలో పరిమితులు విధించారని తెలుస్తోంది.ఈ నాణేన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే నాణేన్ని కొనుగోలు చేయడం ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు.డిమాండ్ ఎక్కువగా ఉంటే మాత్రం నాణేన్ని కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.