ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది.అలాగే స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా యాప్స్ అనేది తప్పనిసరిగా చాలామంది వాడుతున్నారు.
సోషల్ మీడియాలో గంటల కొద్ది గడుపుతున్నారు.అలాగే సోషల్ మీడియాలో లైక్స్( Social Media Likes ) పెంచుకుని పాపులర్ అయ్యేందుకు అనేక ఫీట్లు చేస్తూ యువత ప్రమాదాల బారిన పడుతుంది.
లైక్స్ కోసం ప్రాణాంతకమైన స్టంట్స్( Dangerous Stunts ) చేస్తున్నారు.ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఎంతోమంది ఉన్నారు.
కానీ లైక్స్ మోజులో పడి యువత స్టంట్స్ చేయడానికి వెనుకాడటం లేదు.
పెద్ద పెద్ద భవనాల మీద నుంచి దూకడం, ట్రైన్ వస్తుండగా ఎదురుగా నిల్చోని వీడియో తీయడం లాంటివి చేస్తూ చాలామంది ప్రాణాలు పొగోట్టుకున్నారు.అలాగే బైక్ లు, కార్లపై స్టంట్ లు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.తాజాగా ఒక యువకుడు భయంకరమైన స్టంట్ చేశాడు.
దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక యవకుడు స్కేటింగ్ షూ వేసుకుని ఒక పెద్ద లారీ రెండు టైర్ల మధ్యలో( Lorry Tyres ) వెళుతున్నాడు.
ఒక పెద్ద దిమ్మను గట్టిగా పట్టుకుని ప్రయాణిస్తున్నాడు.లారీ చాలా వేగంగా వెళుతుండగా.
అతని ముందు, వెనుక పెద్ద పెద్ద టైర్లు ఉన్నాయి.
ఈ స్టంట్ చేస్తున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోపై అనేక మీమ్స్ ( Memes ) కూడా వస్తున్నాయి.కొంతమంది చాలా ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
యముడు లీవ్ లో ఉన్నట్లు ఉన్నాడని, లేకపోతే ఇతడు ఎప్పుడో పైకి పోయేవాడని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.రోడ్డు బాగా ఉంది సరిపోయిందని, రోడ్డు బాగా లేకపోతే ఇతని పని గోవిందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
షూ అంటే స్ట్రక్ అయితే ఇతడి పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.