భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వెనుకబడిన తరగతుల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడకుండా ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే విప్ రేగా వద్ద నుంచి మైకును బలవంతంగా లాక్కున్నారు.దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.
దీంతో ఇరువురి నేతలకు ఎమ్మెల్సీ తాతా మధు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.