ఈ మధ్యకాలంలో పలు రకాల వంటలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో కొన్ని రెసిపీలు( Recipes ) ప్రేక్షకుల మనసులను దోచేస్తే, మరికొన్ని నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.
ఇక ఈవెనింగ్ స్నాక్స్ రూపంలో పకోడీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు చాలామంది ఇష్టంగా తింటూ వుంటారు.ఇక వాతావరణం చల్లగా ఉంటే వీటికి వున్న డిమాండ్ అంతాఇంతా కాదు.
ఇష్టమైన కూరగాయలతో కూడా బజ్జీలు వేస్తూ వుంటారు వ్యాపారులు.ఎగ్ బోండా, టమాటా బోండా, క్యాప్సికం బోండా, అరటికాయ బజ్జి ఇలా రకరకాల వంటకాలు మార్కెట్లో ఆహారప్రియులను ఊరిస్తూ ఉంటాయి.
అయితే మీరు ‘డెయిరీ మిల్క్ సిల్క్ పకోడా’( Diary Milk Silk Pakoda ) గురించి ఎప్పుడన్నా విన్నారా? ఇదేం కొత్త ప్రయోగం అని అనుకోవద్దు.దీనిని కూడా చాలా ఇష్టంగా తినే వారు వున్నారు.సాధారణంగా ఇష్టమైన వెజిటబుల్స్‌ని సెలక్ట్ చేసుకుని శనగపిండిలో ముంచి వాటిని క్రిస్పీగా గోధుమ రంగు వచ్చేవరకూ నూనెలో వేయిస్తూ వుంటారు.అయితే డైరీ మిల్క్ సిల్క్ పకోడా ఎలా ఉంటే అదే శనగపిండిలో వెజిటబుల్ బదులు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్( Diary Milk Silk Chocolate ) బార్‌ను ముంచి వేడి నూనెలో వేయిస్తారన్నమాట.
ఫ్యూడీ నోవావ్లాగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూసి ఇంటర్నెట్ వినియోగదారులు విపరీతంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి.
పకోడీని ఇష్టపడేవారు వుంటారు.చాక్లెట్ బార్ ఇష్టపడే వారు ఉంటారు.అలాగని ఈ రెండిటిని కలిపి ఇలా చేయడం చాలా దారుణం అంటూ నెటిజన్లు వాపోతున్నారు.
మరికొందరు నెటిజన్లు “ఈ వీడియో చూసిన తరువాత మేము జీవించే ఉంటే దీనిని నేను ఖచ్చితంగా తింటాను” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు డెయిరీ మిల్క్ మీద నాకున్న ఇష్టాన్ని చంపేశారు.
అంటూ చమత్కారంగా కామెంట్లు పెట్టారు.కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.