తన మూడు విడతల వారాహి యాత్ర( Varahi yatra ) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఆశించిన ప్రయోజనాన్ని నెరవేర్చుకున్న జనసేనా ని తన నాలుగో విడతగా రాయలసీమ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .ప్రజారాజ్యం సమయం నుంచి రాయలసీమలో పెద్ద సంఖ్యలో ఉన్న బలిజలు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు వారే జనసేన రాజకీయ ప్రయాణానికి ముందుండి మద్దతుగా నిలబడతారని అంచనాలో ఉన్న జనసేన వరాహి యాత్ర ద్వారా రాయలసీమలో తమ ఓటు బ్యాంకు ను పటిష్టపరుచుకుని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
కేవలం ఒక ప్రాంతంలోనే జనసేన బలం ఉంది అని అది ఒక ఉప ప్రాంతీయ పార్టీలా మారిపోయింది అని జరుగుతున్న ప్రచారం పార్టీకి మంచిది కాదు అని బావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీమ లో కూడా జనసేన ఉనికిని చటాలని నిర్ణయించుకున్నట్టు గా తెలుస్తుంది .అంతే కాకుండా పొత్తులో అనుకున్న సీట్లు సాదించాలి అన్నా కూడా రాయలసీమలో కూడాతమ బలం నిరూపించు కోవాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
ప్రజారాజ్యం( PrajaRajyam Party ) అంతర్దానం తర్వాత సాంప్రదాయకంగా బలిజ వోటు బ్యాంకు టిడిపితో కలిసి నడుస్తుంది.అయితే జనసేన ఎంట్రీ ద్వారా ఈ ఓటు బ్యాంకులో స్పష్టమైన చీలిక కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి .ముఖ్యంగా బలిజ ఒంటరి సామాజిక వర్గ వర్గ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో తనదైన స్పష్టమైన ఓటు బ్యాంకు ను చూపించాలన్న నిశ్చయంతో పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఉన్నారని తెలుస్తుంది .
రాయలసీమ( Rayalaseema )లోని తమ అనుకూల వర్గాలను గుర్తించి వాటిని వచ్చే ఎన్నికలలోపు పటిష్టపరుచుకొని కనీస స్థాయిలో ఈ ప్రాంతం నుంచి సీట్లను పొంది వాటిలో జనసేన జెండా వేస్తే ఎగురువేస్తే 2029 నాటికి పూర్తిస్థాయిలో పార్టీని రాయలసీమలో విస్తరించ వచ్చన్న ముందుచూపుతోనే జనసేన అధినేత ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మరి సీమ ప్రజలు జనసేనను ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి .