సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది.కానీ చాలా మందికి సినిమా ఇండస్ట్రీపై చేదు ఒపీనియన్ కూడా ఉంది.
దానికి కారణాలు అనేకముగా ఉన్నాయి అనే చెప్పాలి.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు.
ఇండస్ట్రీలో ఎంతో మందికి, ఇప్పుడే వస్తున్న యువతరానికి కూడా ఇన్స్పిరేషన్ అని చెబుతుంటారు.కానీ ఈమధ్య మెగాస్టార్ తీరు చాలా మారిపోయింది.
ఆయన స్పీచ్ 20 మినిషాలకు తక్కువగా ఉండడం లేదు.అంతెక్కడ కొన్నిసార్లు ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
ఈమధ్య సినీ స్పీచ్ లు కూడా పొలిటికల్ అయిపోతున్నాయి.మేము నటిస్తున్నామంటే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని ఈమధ్య హీరోలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు.
కానీ ఇండస్ట్రీలో శ్రమ దోపిడీ ఎక్కువగా జరుగుతుంది.కానీ ఎవ్వరు దీని గురించి ఎక్కువగా మాట్లాడరు.కానీ ఇప్పుడు క్రియేటివిటీ కూడా దోపిడీకి గురవుతుంది.చాలా మంది వారికి నచ్చినది చేయలేకపోతున్నారు.నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు హీరోలు కూడా ప్రతివిషయంలో వేలు పెట్టడంతో క్రియేటివిటీ దోపిడీకి గురవుతుంది.ఇక సినీ ఇండస్ట్రీలో మహిళలకైతే ఎక్కువ విలువ ఉండదనే చెప్పాలి.
ఇప్పటికే చాలా సార్లు కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని చాలా మంది చెప్పగా, కొందరు మళ్ళీ అవకాశాలు రావేమో అని బయటికి చెప్పడం లేదు.ఇక సినిమాలో పాటలు చాలా ముఖ్యం.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరు మాట్లాడుతుంటారు.కానీ అసలు సింగర్స్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పటికి చాలా మందికి తెలియదు.
ఇండస్ట్రీలో దాసరి తరువాత పెద్ద అని చిరంజీవిని అంటున్నారు.
తెలుగు సినిమా ఇప్పుడు చాలా మారిపోయింది.100 కోట్ల రేంజ్ ను అందుకుంటుంది.పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది.
కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.చాలా మంది చాలా ఏళ్లుగా అసిస్టెంట్ గా ఉండిపోయారు.
ఇక ఇప్పుడు ఏదైనా హీరోలు చెప్పిందే నడుస్తుంది.హీరో చెబితేనే హీరోయిన్ ని, దర్శకుడిని, ఇలా ప్రతిఒక్కరిని హీరో చెబితేనే పెట్టుకుంటున్నారు.
హీరో చెప్పిందే శాసనం అవుతుంది.ఇక ఇప్పుడు హీరోలు కూడా మెగా ఫోన్ ని పట్టుకుంటున్నారు.
దర్శకులుగా మారుతున్నారు.రాజమౌళి( Rajamouli )కి తప్ప మిగితా డైరెక్టర్స్ కి అంత స్వేచ్ఛ లేదనే టాక్ నడుస్తుంది.
చూడాలి మరి ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు జరుగుతాయో.లేదో!
.