ఏపీలో వైసీపీ నేతలపై టీడీపీ నాయకుడు బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ విమర్శించడంలో ఆశ్చర్యం ఏం లేదన్నారు.
ఇప్పుడు చిరంజీవిని విమర్శిస్తున్నారన్న బోండా ఉమ గతంలో రజనీకాంత్, కేసీఆర్ ను విమర్శించారని తెలిపారు.
ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని బోండా ఉమ ప్రశ్నించారు.
సినీ పరిశ్రమ జోలికి ఎందుకు వస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని చిరంజీవి చెప్పారన్నారు.చోటా మోటా పకోడీగాళ్లు కూడా చిరంజీవిని విమర్శిస్తారా అని ప్రశ్నించారు.