సమాజంలో కొందరు మహిళలు, మగవారి కంటే తామేం తక్కువ కాదని అత్యంత దారుణాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు.వివాహం చేసుకున్న తర్వాత వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అడ్డుగా ఉన్న వివాహ బంధాలను తెంచయ్యడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.
పెళ్లి తర్వాత అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ ఇంటి పరువును బజారుకు ఈడుస్తున్నారు.
వివాహేతర సంబంధాలు కొనసాగించడంలో మగవారి కంటే మహిళలే( Women ) కాస్త ముందంజలో ఉన్నారు.
ఈ వివాహేతర సంబంధాల కోసం భార్యలు, భర్తలను హత్య చేయడం, చేయించడం కూడా చేస్తున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఒక షాకింగ్ ఘటన కేరళలోని పారుమల( Parumala in Kerala ) ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.
కేరళలోని కాయంకుళం పుల్లుకులుంగర కండల్లూరు లో అనూష( Anusha ) అనే యువతి నివసిస్తుంది.అనూష భర్త విదేశాలలో ఉంటున్నాడు.
ఆ ప్రాంతానికి చెందిన స్నేహ అనే మహిళ భర్తకు అనూష తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.అనూష తన ప్రియుడి భార్య స్నేహను అడ్డు తొలగించుకుంటే ప్రియుడుతో వివాహేతర సంబంధం కొనసాగించవచ్చు అని భావించి స్నేహను హత్య చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ రచించింది.

ఇంతకు ప్లాన్ ఏమిటంటే.స్నేహ డెలివరీ అయ్యాక ఆసుపత్రిలోనే హత్య చేయాలని, దీనికోసం ఎయిర్ ఎంబోలిజం( Air embolism ) అనే విధానాన్ని ఎంచుకున్నారు.ఇక స్నేహ డెలివరీ అయిన తర్వాత అనూష నర్స్ డ్రెస్ వేసుకొని ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చింది.ఎవరూ లేని సమయం కోసం ఎదురుచూసి స్నేహ ఉండే గదిలోకి ప్రవేశించి ఖాళీ సిరంజి తీసుకొని దానిని గాలిలో నింపుకొని స్నేహకు సిరంజి గుచ్చి చంపాలని ప్రయత్నించింది.
ఇలా ఖాళీ సిరంజి గుచ్చితే.రక్తంలో గాలి ప్రసరణ జరిగి ఊపిరితిత్తులకు ఇబ్బంది కలగడంతో గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఇలా స్నేహాన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉండడంతో స్నేహకు అప్పటికే కొద్దిగా నొప్పి కలగడంతో స్నేహ అప్రమత్తమైంది.స్నేహ గట్టిగా కేకలు వేయడంతో హాస్పటల్ సిబ్బంది వెంటనే అనుషను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ప్రియుడి కోసం ప్రియుడి భార్యను అడ్డు తొలగించుకోవడానికి ఇలా చేసినట్లు పోలీసుల ముందు అనూష అంగీకరించింది.అనూష తో పాటు స్నేహ భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.